సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
ఎస్సై వెంకటేష్ ను సన్మానించిన బీజేపీ మండల అధ్యక్షులు సంపత్‌కుమార్
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి నూతనంగా వచ్చిన ఎస్సై వెంకటేష్ ను బుధవారం బీజేపీ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్సై వెంకటేష్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గరిడేకిషన్, సముద్రాల శ్రీనివాస్, చిర్లoచతిరుపతి, కూస వెంకటేష్ , బంగారు సతీష్, మహేందర్, సంపత్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.