సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
అన్నదానం మహాదానం : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
అన్ని దానాలలోకెళ్ల అన్నదానం మహాదానమని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ గణేష్ మండలి, శాంతినగర్ కాలనీలోని యువతరంగ్ యూత్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా వినాయక మండపాల వద్ద గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు జన్నారపు శంకర్ , పరిమి సురేష్ ,కుర్మా శ్రీనివాస్ ,మున్సిపల్ కమిషనర్ మనోహర్ , గణేష్ మండలి సభ్యులు నాయకులు ఎనగందుల నారాయణ, పరంకుశం శ్రీనివాస్, బక్క శెట్టి కిషోర్, సంద పోశెట్టి, పడాల రాజశేఖర్, శోభన్, సతీష్, వెను, రాకేష్,రాజు, సాంకేత్, సుమిత్, రాజేశ్వర్, సుమన్, శంకర్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.