సిరాన్యూస్, బేల:
ఓటమికి కుంగిపోవద్దు… వచ్చే ఎన్నికలకు సిద్ధం కండి...
+ పార్టీ శ్రేణులకు కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపు
+ బేల మండలంలో విస్తృతంగా పర్యటన...
బేల మండలంలోని ఓల్డ్ సాంగిడి, న్యూ సాంగిడి, బెధోడ, కంగార్ పూర్, గూడ, మనియార్ పూర్, దహెగావ్ ఖోగ్దూర్, కొబ్బాయ్, మాంగ్రూడ్, పొనాల, రంఖం, మారుతీ గూడ, చాంద్ పెల్లి, భవానీ గూడ గ్రామాలను సందర్శించారు. గ్రామస్తులు, కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ప్రతీచోట ఘన స్వాగతం పలికారు. మహిళలు నుదుట తిలకం దిద్ది స్వాగతించారు. దురదృష్టవశాత్తు కొందరి కుట్రలు, మోసాల వల్ల ఓడిపోయామని ఓటమికి ఎవరూ నైరాశ్యం చెందవద్దని సూచించారు. అయినా గత ఎన్నికలకంటే చాలా అదనంగా 47వేల పై చిలుకు ఓట్లు సాధించామన్నారు. తనపై విశ్వాసముంచి ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటానన్నారు. ఇక నుండి ప్రతి కార్యకర్త పట్టుదలగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలన్నారు. అంతకుముందు పాత సాంగిడికి చెందిన గేడం లక్ష్మణ్ అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థికసాయం అందించి ఉదారతను చాటుకున్నారు. దహెగావ్ గ్రామంలో అనారోగ్యం బారినపడ్డ ఇక్రమొద్దీన్ ఖాజీని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికసాయం చేసి బాసటగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసీసీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మండల మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, మాజీ ఎంపీపీ బాపూరావ్ హుల్కె, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావార్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు మడావి చంద్రకాంత్, అవాల్ పూర్ ఎంపీటీసీ నగేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.