సిరాన్యూస్, చిగురుమామిడి
క్రీడలతో మానసికోల్లాసం : మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్
* ఘనంగా మండల స్థాయి ఎస్.జి.ఎఫ్ గేమ్స్ ప్రారంభం
క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎస్.జి.ఎఫ్( స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) క్రీడలను ఎంపీడీవో ఖాజా మొయినొద్దీన్, మాజీ ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై రాజేష్ లతో కలిసి ప్రారంభించారు.ముందుగా ఎస్. జి.ఎఫ్ క్రీడల జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని అన్నారు.అనంతరం ఎస్.జి.ఎఫ్ క్రీడల ప్రతిజ్ఞను విద్యార్థులదే చేయించారు. వాలీబాల్ పోటీలను స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ సర్వీస్ చేసి ప్రారంభించారు.కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ క్రీడల సెక్రటరీ సమ్మయ్య, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పావని, విజయలక్ష్మి, జయప్రద, రబియా బస్రి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కిషన్ నాయక్, బాల్ రెడ్డి, చంద్రశేఖర్, ముని ప్రసాద్, లింగారెడ్డి, మల్లేశం, రవీందర్, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు చైతన్య, ఆయా పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు పాల్గొన్నారు.