సిరా న్యూస్, కోనరావుపేట:
సర్పంచులకు ఘన సన్మానం…
కోనరావుపేట మండల ప్రజా పరిషత్ ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశంలో సర్పంచులను ఘనంగా సన్మానించారు. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షులు చంద్రయ్య గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సర్వ సభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, సభను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామాల్లో తాగునీటి వ్యవస్థ, మురికి కాలువలు, రోడ్డు సౌకర్యం తదితర అంశాలపై శ్రద్ధ వహించాలని అన్నారు. కాగా త్వరలోనే పదవి కాలం ముగుస్తున్నందున సర్వసభ్య సమావేశానికి హాజరైన సర్పంచులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.