సిరాన్యూస్,బోథ్
పిల్లలను పాఠశాలలో చేర్పించిన మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సాయి నగర్ కి చెందిన ఇద్దరు పిల్లలు 6,7 వ తరగతి పిల్లలను స్థానిక ప్రభుత్వ జిల్లా సెకండరీ (బాలుర) పాఠశాలలో మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ తరుపున అడ్మిషన్ చేయించారు.ఈ సందర్బంగా మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ మాట్లాడుతూ బోథ్ పట్టణం సాయి నగర్ కి చెందిన జాదవ్ శశి తన ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు పిల్లలను బడికి వెళ్లక ఖాళీగా తిరుగుతూన్న వారికి గుర్తించి మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కి తెలియజేశారు. వారిని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయం కి తీసుకొని వచ్చి వారిని స్థానిక జిల్లా బాలుర సెకండరీ పాఠశాల లో అడ్మిషన్ చేయడం జరిగింది. పిల్లలకు భవిష్యత్తులో విద్య కి సంధించిన మొత్తం భరిస్తాం అని తెలిపారు. దీనికి సహకరించిన ప్రధాన ఉపాధ్యాయుడు మహమూద్, ఉపాధ్యాయుడు ఆర్టీవీ ప్రసాద్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సల్ల రవి, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.