ఆర్టీసీ బస్ స్టాండ్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

సిరా న్యూస్,మిర్యాలగూడ;
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కాలినడకన ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసారు. బస్టాండ్ ఆవరణములో సానిటైజేషన్ , మరుగుదొడ్లు సరిగా లేవని కాంట్రాక్టర్ ఫై మండిపడ్డారు. తక్షణమే బస్టాండ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ కు ఆదేశాలు ఇచ్చారు. ప్రయాణికుల భద్రత పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *