సిరా న్యూస్,పిఠాపురం;
ఏలేరు వరద ముంపు కారణంగా ఇబ్బందులు గురవుతున్న చేనేత కార్మికుల కుటుంబాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ఆదుకుంటారని ఎవరు అధైర్య పడవద్దని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేనేత కార్మికులకు భరోసా కల్పించారు. గొల్లప్రోలు నగరపంచాయతీలో గల ఈబీసీ కాలనీ,మార్కండేయపురం తదితర ప్రాంతాల్లో ఏలేరు వరద నీరు రావడంతో చేనేత మగ్గాలన్నీ దెబ్బతిన్నాయి.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ చేనేత కుటుంబాల ఇళ్ళకు వెళ్ళి చేనేత మగ్గాల్ని పరిశీలించి,చేనేత కార్మికులతో మాట్లాడారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు..