సిరా న్యూస్,పెద్దపల్లి;
అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే విజయరమణారావుకు మహనీయుల ఆశయ సాధన సంఘం అధ్యక్షులు బొంకురి కైలాసం అందజేశారు. ఈ భవన నిర్మాణం కోసం గత మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రూ.19.50 లక్షల నిధులు మంజూరి చేశారన్నారు. పని నిర్మాణం చేసే సమయంలో ఎలక్షన్ కోడ్ రావడంతో నిర్మాణం నిలిచి పోయిందన్నారు. కాగా ఈర్ల సురేందర్ అనే వ్యక్తి ఈ స్థలంలో అంగన్ వాడి కేంద్రం ఏర్పాటు చేయాలని వార్డు సందర్శనలో మీ దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. మళ్ళీ ఈర్ల సురేందర్ అంబేద్కర్ కమ్మ్యూనిటీ హాల్ పనులు మొదలు మొదలుపెట్టాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తనపై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని అంబేద్కర్ భవనం నిర్మాణం కాకుండా చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆ వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. వెంటనే భవన నిర్మాణ పనులు మొదలు పెట్టాలని లేని యెడల అంబేద్కర్ విగ్రహం ముందు టెంట్ వేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.