సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
మహా ముత్తారం మండలం లో కంప్యూటర్ ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నపుట్టల రమేష్ ఆకస్మిక మరణంతో అతని కుటుంబానికి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ ఉద్యోగులు 166301/- నుండి రూ.150000/- మొత్తమును పుట్టల రమేష్ కూతురు పుట్టల రాగిణి పేరున “సుకన్య సమృద్ధి యోజన పథకం” కింద పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఇట్టి మొత్తము పాపకు 21 సంవత్సరాలు నిండిన తరువాత పాప మాత్రమే మొత్తము పొందే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. శుక్రవారం ఐడిఓసి.కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాండు, మిగిలిన మొత్తం రు.16301/- నగదును రమేష్ సతీమణి పుట్టల రజిత కు అందించడం జరిగింది. ఈ సందర్భంగా పుట్టల రజిత కలెక్టర్ గారిని తన భర్త చనిపోయినందున, తాను డిగ్రీ చదివి ఉన్నానని, తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మహా ముత్తారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం. శ్రీనివాస్, ఉపాధి హామీ పథకం ఎపిఓ ఎం. కుమారస్వామి, ఉపాధి హామీ ఉద్యోగులు ఇంజనీరింగ్ కన్సల్ టెంట్స్ నాగేందర్, మంగీలాల్, ప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్లు నవీన్, షఫియోద్దీన్, రాజేందర్, శ్రీనివాస్, రాజకుమార్, సీసీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.