సిరా న్యూస్,ఓదెల
అన్నదానం మహాదానం: మాజీ ఎంపీటీసీ సదానందం
అన్నదానం మహాదానమని మాజీ ఎంపీటీసీ సదానందం అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో శనివారం మీర్జంపేట గ్రామంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామంలోని అన్ని వినాయకులను మాజీ ఎంపీటీసీ పోశాల సదానందంగౌడ్-శైలజ దంపతులు, కూతురు అర్చన దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు, గ్రామ యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.