నిరుపేద వ్యాపారులకు కో- ఆపరేటివ్ సొసైటీల ద్వారా మేలు జరగాలి

-రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బియ్యాబానీ, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

సిరా న్యూస్,పెద్దపల్లి;

నిరుపేద వ్యాపారులకు కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా మేలు జరగాలని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బియాబానీ, శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ నూతన కార్యాలయాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద వ్యాపారులను ఆర్థికంగా ఆదుకొని వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలని సొసైటీ సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మజాహర్ ఖాస్మి,అతిఖుర్ రహమాన్, అబ్దుల్ రహమాన్, పెద్దపెల్లి మ్యాక్స్ అధ్యక్షులు ఎస్ డబ్ల్యూ ఆయాజ్, సాహిద్ అహ్మద్, జమీర్, ఆదిల్ మరియు పి మ్యాక్స్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *