లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సాన రామకృష్ణారెడ్డి
సిరా న్యూస్,కమాన్ పూర్;
కమాన్ పూర్ లైన్స్ క్లబ్ ద్వారా మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని లైన్స్ క్లబ్ అధ్యక్షుడు లైన్ సాన రామకృష్ణారెడ్డి అన్నారు.
శనివారం కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి ఆదర్శనగర్ లో గల సాన గార్డెన్లో జూలపల్లి గ్రామానికి చెందిన ఇరుగు రాళ్ల శ్రీజ, ఇరుగు రాళ్ల రజిత, లకు లైన్స్ క్లబ్ ద్వారా కుట్టు మిషన్లను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇటీవల కంటి ఆపరేషన్లు, నిరుపేదలకు ఆర్థిక సహాయం, వంటి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్ లైన్స్ క్లబ్ సభ్యులు లయన్ అనవేన లక్ష్మీరాజ్యం లైన్ బండ సాయి శంకర్, లైన్ జబ్బార్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.