సిరాన్యూస్, సామర్లకోట
కర్రి వీరశివ యువకుడికి విశిష్ఠ సేవా పురస్కారం
పెద్దాపురం మండలంలోని ఆనూరు గ్రామానికి చెందిన కర్రి వీరశివ అనే యువకుడికి విశిష్ఠ సేవా పురస్కారం లభించింది. డా. మొండి రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం కాకినాడలో సూర్య కళామందిరంలో నిర్వహించిన చేయూత సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న సేవాదాతలకు విశిష్ఠ సేవా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు)లు పాల్గొని వారి చేతుల మీదుగా సేవాదాతలకు సన్మానం చేసి అవార్డులు అందజేశారు.