ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం అయినా దగ్గరుండి చెట్లను కొట్టిస్తున్న వైనం
క్రింద పడ్డ ఐదు చెట్లకు పర్మిషన్ ఉందంటూ వృక్షాలు తొలగిస్తున్న వైనం
సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం డీఆర్డీయే కార్యాలయంలో కలప దొంగలు పడ్డారు.భారీ వృక్షాలను నరికేసి అక్రమంగా తరలిస్తున్నారు..ఆదివారం సెలవుదినం కావడంతో ఇద్దరు అటెండర్ల సహాయంతో కలప స్మగ్లర్ యథేచ్ఛగా విలువైన భారీ వృక్షాలను నరికేస్తూ వాహనాల్లో తరలింపుకు సిద్ధం చేస్తున్నారు అక్రమార్కులు. ఈ కార్యాలయంలో గత 30 ఏళ్ల క్రితం నాటిన మొక్కలను కొందరు అధికారులు,కలప స్మగ్లర్ తో చేతులు కలిపి సొమ్ము చేసుకుంటున్నారు.ఈ తతంగం అంతా డీఆర్డీయే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్ అండ్ బీ శాఖా అధికారుల కనుసన్నల్లో జరగడం కొసమెరుపు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒరిగిన చెట్ల తొలిగింపు ముసుగులో పెద్ద పెద్ద వృక్షాలను నరికి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు.ఆదివారం సెలవు దినం అయినప్పటికీ ఇద్దరు ప్రభుత్వ అటెండర్లు మద్యం సేవించి అక్రమ కలప రవాణాకు సహకరిస్తున్నారు.ఆన్లైన్ లో అప్లై చేశామని,ఇంకా అనుమతులు రాలేదని కలప స్మగ్లర్ అంటున్నాడు. .అనుమతులు రాకుండానే ఇంత భారీ వృక్షాలను నరికెందుకు అధికారులు ఎలా అంగీకరించారనేది అర్ధం కాని విషయం..మీడియా వీడియోలు తీస్తుంటే తాగిన మత్తులో ఉన్న అటెండర్లు తమకు పర్మిషన్ ఉందని బుకాయించే ప్రయత్నం చేసారు. నరికే చెట్లను వదిలేసి వెళ్లిపోయారు.