దేశంలో సామాజిక వివక్షతను, బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా తన జీవితకాలం మొత్తం పోరాన మహనీయుడు మన పెరియార్ రామస్వామి

-నేడు ఆయన జయంతి
సిరా న్యూస్;
భారతీయ సమాజంలో కుల వ్యవస్థ నరనరాల్లో జీర్ణించుకొని అన్ని రంగాల్లో అసమానతలు పెరగడానికి కారణమైంది. ఈ అసమానతలను రూపుమాపడానికి సాహు మహరాజ్‌, నారాయణ గురు, రామస్వామి పెరియర్‌ వంటి సామాజిక విప్లవవీరులు చేసిన త్యాగఫలితంగా భారతదేశం స్వేచ్ఛా, సమానత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయాలు పునాదులుగా ఏర్పడిన భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూనే సమసమాజ నిర్మాణానికి దోహదం చేశారు. దక్షిణ భారతదేశ ప్రజలచే ముఖ్యంగా తమిళనాడు ప్రజలచే పెరియర్‌గా తాన్‌ తై పెరియర్‌గా ఆత్మీయంగా పిలవబడే ఈరోడ్‌ వెంకట రామస్వామి 1879లో ఈరోడ్‌లో ఇదే రోజు జన్మించారు. సంఘ సంస్కర్తగా, హేతువాదిగా, ఆత్మగౌరవ ఉద్యమ నిర్మాతగా ద్రావిడ ఉద్యమ సారథిగా ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రజలు ఆయనను పెరియర్‌గా పిలుచుకునేవారు. ‘పెరియర్‌’ అంటే ‘పెద్ద మనిషి’ అని అర్థం.
సమాజంలో ఆయన కుల, మత, వర్గ ఆధిపత్యాలపై తిరుగుబాటు చేశాడు. కుల, మత రహిత సమసమాజం కావాలని ఆయన ఆకాంక్ష. కానీ నిన్నగాక మొన్న పరువు హత్యలు ఈ దేశంలో జరిగిన తరుణంలో పెరియర్‌ జయంతిని నిర్వహించుకుంటున్నామంటే ఆయన ఆకాంక్ష ఇంకా అలాగే ఉంది. మహిళలకు సమాన హక్కులు కావాలని ఆయన కాంక్షించారు. పెరియర్‌ ముఖ్యంగా సమాజంలో ప్రధానంగా నెలకొని ఉన్న బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. దక్షిణ భారతానికి చెందిన ద్రావిడులపై ఉత్తరానికి చెందిన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించేది లేదని స్వీయభావన ఉద్యమాన్ని నిర్మించారు. అగ్రవర్ణాలు తమ ఆధిప త్యాన్ని కొనసాగిం చడం కోసమే ఈ దేవుండ్లు, గుడులు, గోపురాలను నిర్మి స్తూ పనికిమాలిన పురాణా లను సృష్టించారని ప్రచారో ధ్యమాన్ని సాగించడం ద్వారా ఆయన ప్రముఖ హేతువాదిగా పేరు పొందారు. హేతువాదం, ఆత్మగౌరవం, స్త్రీ హక్కులు, కుల నిర్మూలన కోసం పెరియర్‌ చేసిన పోరాటం అప్పటికీ, ఇప్పటికీ ఒక చరిత్రగా మిగిలిపోతుంది. మూల-ద్రావిడ వాసులైన బ్రాహ్మణేతరులను, భార తదేశానికి చెందిన బ్రాహ్మ ణులు దోపిడీ చేయడాన్ని అణివేయడాన్ని వ్యతిరేకించారు. తమిళ సమాజాన్ని విప్లవ మార్గంలో నడిపి కుల వివక్షతను తొలగిం చడానికి తీవ్రంగా కృషి చేసిన వ్యక్తిగా తమిళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి పెరియర్‌ రామస్వామి. అందుకే ఆయ నను ఆధునిక కాల ప్రవ క్తగా, ఆగేయ ఆసియా సోక్రటిస్‌గా, సామాజిక విప్లవ పితామహుడిగా, అజ్ఞానం, అంధ విశ్వాసాలు, అసంబద్ధమైన అచిర వ్యవహారాల ను వ్యతిరేకించే వారిగా యునెస్కో అభివర్ణించింది.

”దేవుడు లేడు, దేవుడు లేడూ, అసలు దేవుడే లేడు” అనే నినాదంతో పెరియర్‌ సాగించిన ఉద్యమం ప్రధానమైనది, కుల, మత వ్యత్యాసాలు కలిగిన భారతదేశం తనకు వద్దని, కుల, మత రహితమైన భారతమే తనకు కావాలని పోరాటం చేశాడు. కుల, మతాలను రాజ్యాంగం నిషేధించినప్పుడే కుల, మత రహిత స మాజం ఏర్పడుతుందని ఆయన వాధించాడు. హిందుత్వ వాదాన్ని గట్టిగా వ్యతిరేకించారు. కాబట్టే వారికి పెరియర్‌ అంటే గిట్ట డం లేదు. పెరియర్‌ తన ఆశయాల సాధన కోసం 1939లో జస్టిస్‌ పార్టీ పెట్టారు. 1944లో జస్టిస్‌ పార్టీని ‘ద్రావిడ్‌ దార్‌ కళనంగా’ మార్చారు. ఈ పార్టీ సామాజికోద్యమానికే ప్రాధాన్యతని చ్చి ఎన్నికలకు దూరంగా ఉండి మరీ పోరాటం చేసింది. అంట రానితనం, కులం, వర్ణ వివక్షత తీవ్రంగా ఉన్న దేశంలో ప్రజల తో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, వారి మధ్య ఉన్న సా మాజి క ఆర్థిక సమానత్వాన్ని సాధించడం కుల వ్యవస్థను దోపిడీ మ యమైన సాంప్రదాయాలను నిర్మూలించడమే పెరియర్‌ ధ్వేయం. హిందూ మతం ఆపాదించిన తరతరాల బానిసత్వాన్ని వదిలించుకునేందుకు దేవుడు ఒక్కడే, మనుషులంతా ఒక్కటే అని చాటడం మంచిదని ప్రభోధించాడు. ఎప్పుడు ఆయన భావాలు, ఆలోచనలు విప్లవాత్మకమైనవిగానే ఉండేవి.

దేశం కుల, మత కంపులో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మత దురహంకారాన్ని వ్యతిరేకిస్తూ శాస్త్రీయ, హేతుబద్ధమైన జీవన విధానాన్ని అవలంభించిన రోజు ఈ రోజు. ఆత్మగౌరవ పోరాటాలు చేసిన దళితులు, స్త్రీలు, బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోసి, తన చివరి శ్వాస వరకు సమసమాజం కోసం పోరాటం చేసిన సామాజిక విప్లవకారుడు పెరియర్‌ రామస్వామి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *