సిరా న్యూస్,విజయవాడ;
వరద ముంపు ప్రభావం పడిన ప్రాంతాల్లో చివరి మైలు వరకు న్యాయం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి బాధితు నికీ అండగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నా రు. పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా నష్టం వివరాల నమోదుతో నివేదికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ముం పు ప్రభావం పడిన ప్రతి ఇంటినీ సందర్శించి, నష్టం నమోదు చేసిన ట్లు తెలిపారు.