సిరా న్యూస్,మేడ్చల్;
డ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. .మేడ్చల్ మున్సిపల్ పరిధిలో కిష్టాపూర్ గ్రామ లో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిని గొంతు కోసారు. ఒక్కరి పరిస్థితి విషమంగా వుంది. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బీహార్ కు చెందిన పవన్ కుమార్ ,సంతోష్ కిష్టాపూర్ లో నివాసం ఉంటున్నారు. సంతోష్ పరిస్థితి విషమంగా వుండడంతో నగరంలోని ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున 4గంటలకు ఘటన జరిగింది. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.