సిరా న్యూస్,సామర్లకోట;
సామర్లకోట మండలం నవర జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ ను పక్క గ్రామానికి మార్చే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారని గ్రామస్తులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు , నవర గ్రామంలోనే స్కూల్ కాంప్లెక్స్ ఉండాలని ఈ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయని వేరే గ్రామానికి మార్చితే ఊరుకో బోమని గ్రామస్తులు ఆందోళనకు దిగారు సామర్లకోట విద్యాశాఖ అధికారి వై. శివరామకృష్ణయ్య నవర గ్రామానికి చేరుకుని గ్రామస్తులు స్కూల్ హెచ్ఎం సమక్షంలో లిఖితపూర్వకంగా లెటర్ రాసి మార్చబోమని తెలియజేశారు , విషయ తెలుసుకున్న డి.ఓ.ఈ.ఓ , నవర పులి వద్దకు చేరుకుని గ్రామస్తులతో విద్యాశాఖ అధికారులను వివరాల అడిగి తెలుసుకుని , గ్రామస్తులతో మాట్లాడి వారికి స్కూల్ కాంప్లెక్స్ ప్రపోజల్స్ గూర్చి వివరాలు గ్రామస్తులు వివరాలు తెలియజేశారు అనంతరం నవర గ్రామ ప్రజలకు స్కూల్ కాంప్లెక్స్ తరలించే ప్రక్రియను ఆపేందుకు కలెక్టర్ దృష్టికి డీఈవో దృష్టికి తీసుకువెళతానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు