సిరా న్యూస్,అన్నవరం;
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సత్యప్రమాణాల దేవునిగా శ్రీ రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి పేరు ఉంది. విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడ వ్రతాల కోసం వస్తారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న అధికారులు దేవుడిని రోడ్డు మీద పడేస్తున్నారు. పోలీస్ స్టేషన్ వరకు లాగుతున్నారు. తాజాగా దేవస్థానంలో పనిచేసే అసిస్టెంట్ ఈఓ, సూపరిండెండెంట్ ,ఓ ఉద్యోగి,మరో దేవస్థానం కాంట్రాక్టర్ నలుగురు కలిపి తుని రూరల్ సర్కిల్ పరిధిలో తేటగుంటలో పేకాట క్లబ్ లో దొరికేశారు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ లెక్కచేయకుండా పోలీసులు ఎఫ్ ఐ ఆర్ వేశారు. కానీ వీరిపై దేవస్థానం చర్యలు తీసుకోలేదు .దీంతో భక్తులు మండిపడుతున్నారు.