సిరా న్యూస్,గుత్తి;
అనంతపురం జిల్లా, గుత్తి పట్టణములోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి ఆలయంలో మహాలయ పౌర్ణమి సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆలయ అర్చకులు వాసుదేవ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూలమూర్తికి వేకువజామున సుప్రభాత సేవ, అర్చనలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాభిషేకాలు, పసుపు జలంతో అభిషేకాలు నిర్వహించారు.అమ్మవారికి పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ఆవరణంలో మహిళలు శ్రీ చక్ర కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజలు శ్రీ వాసవి అమ్మవారికి నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి నామస్మరణంతో ఆలయం మారు మోగింది. భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.