సిరా న్యూస్,మంచిర్యాల;
మంచిర్యాల జిల్లా నస్పూర్ లో సర్వే నంబర్ 42 లో టీబీజీకేఎస్ నాయకుడు డీకొండ అన్నయ్య అక్రమంగా నిర్మాణం చేసుకున్న 5 అంతస్తుల భవనం పై చర్యలు మొదలు అయ్యాయి. గురువారం నాడు మునిసిపల్, రెవెన్యూ అధికారులు డికొండ అన్నయ్య ఇల్లును కూల్చేసారు. ముందుగా ఆ భవనంలో వున్న సామను ను మున్సిపల్,రెవెన్యూ సిబ్బంది కిందకు దింపారు. తరువాత కూల్చివేత ప్రారంభించారు.