సిరా న్యూస్, ఆదిలాబాద్
దశలవారీగా ఆదిలాబాద్ సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
* 19 లక్షలతో మంచి నీటి ట్యాంకు భూమి పూజ
ఆదిలాబాద్ పట్టణంలో సమస్యలను దశరవారీగా పరిష్కరిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అమృత్ పథకంలో భాగంగా రూ.16తో మంచినీటి ట్యాంకు నిర్మాణ కోసం శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కె ఆర్కె కాలనీలో ఎంపీ జి.నాగేష్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి పలు సందర్భాలలో విన్నవించడం జరిగిందని తెలిపారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ పథకం కు సంబంధించిన నిధుల కోసం ఆదిలాబాద్ ఎంపీ ప్రయత్నిస్తూ ఉన్నారని తెలిపారు. ఆ నిధులు వస్తే పట్టణం మరింత అభివృద్ధి చేసుకొని అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత నాణ్యత ప్రమాణాలతో పనులను చేపించాల్సిన బాధ్యత పూర్తిగా అధికారులపై ఉందని తెలిపారు. అమృత్ పథకంలో నిధులు మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎంపీ జి నగేష్ మాట్లాడుతూ నీటి సమస్య లేకుండా, మురికి కాలువలు సిస్టం సరిగ్గా ఉండాలని ఉద్దేశంతో అమృత్ పథకంలో అదిలాబాద్ మున్సిపాలిటీ ఎంపిక చేయడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంతో రూ.320 కోట్లు తో పట్టణ ప్రజల దహర్తిని తిరుచెందకు పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రభుత్వమిచ్చిన సమయాన్ని కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మున్సిపాలిటీలో మీ సమస్యలు పరిష్కారం నుంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ హైమద్, ఈఈ గంగాధర్ నాయకులు అశోక్ రెడ్డి సాయి రాము, స్వప్న సురేఖ, రాజు, నాందేవ్, మున్నా, స్వప్నిల్, తదితరులు పాల్గొన్నారు.