సిరా న్యూస్,హైదరాబాద్;
మలక్ పేట నియోజకవర్గంలోని సైదాబాద్ మండలంలోని పిల్లి గుడిసెలు లో ఉన్న డబుల్ బెడ్రూం లను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ వాటి పరిస్థితి చూసి ఇక్కడ ఉంటున్న వారికి డబుల్ బెడ్రూం లు ఇవ్వడంతో పాటు హైదరాబాద్ లో ఉన్న వారికి డబుల్ బెడ్రూం లు ఇవ్వాలని ఆలోచన ఉంది వాటిని ఎంత వీలైతే అంత భవిష్యత్ లో తీసుకున్న ఇందిరమ్మ ఇల్లతో ముందుకు వెళ్తాం. మూసీ పాత నగరం గా కాకుండా పురోగతి చెందే నగరంగా మూసి రూపుదిద్దుకుంటుంది. మూసి ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక , పారిశ్రామిక , పర్యావరణ ,నీటి ఇబ్బందులు లేకుండా అందమైన టూరిజం ప్రాంతంగా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు తో ముందుకు వెళ్తున్నాం. పునరావాసం కింద నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది లేదు నష్టం లేకుండా చూస్తున్నాం.. అందరికీ రీహబిటేషన్ జరుగుతుందని అన్నారు. అందరూ సహకరించాలి.. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా నష్టపోతున్నమని భావిస్తున్నారో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. హైదరాబాద్ కొత్త ఇనోవేటెడ్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. మూసి ప్రక్షాళన ,మూసి పునః నిర్మాణం మూసి భవిష్యత్ ప్రణాళికల తో పోతున్నాం. ఎవరికి అన్యాయం చేయలేని ఆలోచన లేదు..ఎవరికైనా మిస్ అయిన స్థానిక నాయకులతో కలిసి వారికి అండగా ఉంటాం. అన్ని రకాలుగా సహకరిస్తం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మూసి ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా ముందుకు పోతున్నం. ఇప్పటికే ఇళ్లలోకి పోయిన వారు చాలా కంఫర్ట్ గా ఉన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలల , రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ ,జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి , ఏంఆర్డిసిఎల్ జాయింట్ డైరెక్టర్ గౌతమి ,ఇతర మూసి డెవలప్మెంట్ అధికారులు పాల్గోన్నారు.