సిరాన్యూస్, ఆదిలాబాద్
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు నడుo బిగిద్దాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
* ఘనంగా నివాళులు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయాల సాధనకు ప్రభుత్వం కృషి చేయాలని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ ఆన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి పురస్కరించుకొని శనివారం ఆదిలాబాద్ లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ ఆపేక్ష లేకుండా నిస్వార్ధంగా బడుగు వర్గాల కోసం పరితపించిన మహా వ్యక్తి అని కొనియాడారు. ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా చూడాలని కోరారు. ఆదిలాబాదులోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ స్థలంలో మూడు లక్షలతో అభివృద్ధి పనులు చేపడతామని , నందనవనంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, పద్మశాలి అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ (పోపా)జిల్లా అధ్యక్షుడు బేత రమేష్, తాలూకా అధ్యక్షుడు బొమ్మ కంటి రమేష్, జిల్లా కన్వీనర్ జక్కుల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కామన్ విట్టల్, జిల్లా ఉపాధ్యక్షుడు బూర్ల శంకరయ్య ,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పద్మావర్ రాకేష్, సంఘం నాయకులు మోర ఆశన్న, మండల ప్రధాన కార్యదర్శి తుమ్మరాజు, నాయకులు తాళ్ల రవీందర్, దాసరి రమేష్, మో రకిష్టన్న తదితరులు పాల్గొన్నారు.