జలపాతంలో ముగ్గురు గల్లంతు
సిరా న్యూస్,అల్లూరి;
అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. జలతరంగిణి జల పాతం వద్ద ఐదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. ఒక్కసారిగా వాగు ఉధృతంగా రావడంతో విద్యార్థుల గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిలో నలుగురు అమ్మా యిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలను స్థానికులు రక్షించారు. వారిని ఆస్పత్రికి తరలిం చారు. మిగతా ఇద్దరు అమ్మాయి లు, ఓ అబ్బాయి కోసం గాలింపు కొనసాగుతోంది. విహారయాత్రకు మొత్తం 13 మంది విద్యార్థులు వచ్చారు. ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.