సిరాన్యూస్, కళ్యాణదుర్గం
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
* కళ్యాణదుర్గం పట్టణంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు లాంచనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం వారంలో ప్రతి మంగళవారం, బుధవారం రోజున వ్యవసాయ అధికారులు, శాస్త్రావేత్తలు, ప్రజాప్రతినిధులు పొలం వద్దకు వెళ్లాలని సూచించారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు సాధించేలా పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పరికరాలు వాడటం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలు తెలుపడం, వ్యవసాయ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.