సిరాన్యూస్, ఓదెల
ఓదెల మండల విద్యాధికారిగా ఎర్ర రమేష్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల విద్య వనరుల కేంద్రంలో నూతనంగా మండల విద్యాధికారిగా ఎర్ర రమేష్ బుధవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్బంగా మండల విద్యాధికారిగా ఎర్ర రమేష్‌ను పీఆర్‌టీయూటీఎస్ ఓదెల మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంఈఓ ఎర్ర రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇ. వెంకట్ రెడ్డి, ఎండి. రజాక్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గైని రమేష్, ఉపాధ్యక్షులు భద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసుదాసు, ఏ బూసి శ్రీనివాస్ ఉపాధ్యాయులు ఎమ్మార్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.