సిరా న్యూస్, హుజురాబాద్:
పీడీఎస్‌యూ 50వ శతాబ్ది వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ: జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీడీఎస్‌యూ 50వ శతాబ్ద వారోత్సవాల పోస్టర్ ను బుధవారం ఆవిష్క రించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ మాట్లాడుతూ జార్జి రెడ్డి ఆశయాల పుణికిపుచ్చుకొని నేడు సమాజంలో జరుగుతున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే భారీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లాఉపాధ్యక్షులు కెంసారపు రవితేజ, జిల్లా నాయకులు కొయ్యడ బాబు, ఎండీ అస్లాం, రాకేష్, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.