సిరా న్యూస్,కాల్వ శ్రీరాంపూర్
శ్రీరాంపూర్ మండల విద్యాధికారి ఎస్. మహేష్
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల విద్య వనరుల కేంద్రంలో నూతనంగా మండల విద్యాధికారిగా ఎస్. మహేష్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్బంగా మండల విద్యాధికారిగా ఎస్.మహేష్ ను పీఆర్‌టీయూటీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్షులు ముంజాల హరికృష్ణ, నవీన్, పీజీహెచ్ఎంలు, ఎల్ ఎఫ్ ఎచ్ ఎం లు. కాంప్లెక్స్ ఎచ్ ఎం లు, కె జి బి వి. ఎస్ ఓ. శ్రీదేవి, ఏ. సంధ్యారాణి. ఎమ్మార్సీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.