సిరా న్యూస్,శ్రీకాళహస్తి ;
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పురోభివృద్ధి చెందుతుందని నెల్లూరు జిల్లా కావలి కి చెందిన కంతూరు శ్రీనివాస్ అన్నారు ఇందు కోసమని కావలి నుంచి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి సైకిల్ యాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా బుధవారం శ్రీకాళహస్తి కి వచ్చారు కాంగ్రెస్ జెండాలతో సైకిల్ పై యాత్రను చేస్తున్నట్లు వివరించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు హరి యాణా లో కాంగ్రెస్ విజయం సాధించినందుకు కావలి నుంచి కాణిపాకం వెళ్లి వినాయక స్వామిని దర్శించుకోవాలని మొక్కుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు