సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కొందరు యువకులు కత్తులతో రెచ్చిపోయారు. బుధవారం అర్థరాత్రి పిల్లర్ నంబర్ 209 వద్ద ఉన్న రాయల్ జ్యూస్ సెంటర్లో కస్టమర్ల మధ్య గొడవ జరిగిది. ఆ గొడవను అడ్డుకోబోయిన షాపు యజమానిపై 15 మంది యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 8 మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు