-రజక సంఘం నాయకులు
సిరా న్యూస్,మంథని;
బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని రజక సంఘం నాయకులు పేర్కొన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత వీరనారీ చాకలి ఐలమ్మ 139 వ జయంతి సందర్భంగా గురువారం మంథని పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన పోరాటంలో ఐలమ్మ తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కొల్లూరి రాజయ్య, సమ్మయ్య, పోతరాజు సమ్మయ్య, పైడాకుల నాగరాజు, పోతరాజు శ్రీనివాస్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.