సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ పాతబస్తీ బహదూర్ పురా నియోజకవర్గంలో మూసి నది రివర్ బెడ్ లో ఉన్న ఇండ్ల వివరాలు తీసుకొని రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేయడం కొనసాగుతోంది. హైదరాబాద్ పాతబస్తీ కిషన్ బాగ్, అసద్ బాబ నగర్, నందిముసలై గూడ ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు 5 టీంలుగా ఏర్పడి పోలీసుల సహాయంతో సర్వే చేస్తూ మార్కింగ్ చేస్తున్నారు. దాదాపు 386 ఇండ్లు మూసి రివర్ బెడ్ లోకి వస్తున్నాయి. రివర్ బెడ్ లో వచ్చే అన్ని ఇండ్లలో ఉంటున్న వారి వివరాలు సేకరిస్తూ బహదూర్ పూరా మండలం రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. బహదూర్పురా తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఐదు టీంలు సర్వే చేస్తున్నాయి. మరో నలుగురు తహశీల్దార్లు ఈ సర్వే లో ఉన్నారు. బహదూర్పురా పోలీసులు ఎలాంటి అవంచనియా ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.