నేడు అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం

 సిరా న్యూస్;
అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఇదే రోజు
సెప్టెబంర్ 28న నిర్వహించాలని యునెస్కో ద్వారా నిర్ణయించబడింది. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచడంకోసం ఈ ఉద్యమం ప్రారంభించబడింది. సమాచార హక్కు చట్టం ప్రభుత్వ విధానాల్లో, ప్రభుత్వ సంస్ధలు పనిచేస్తున్న పద్ధతుల్లో పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించినది. భారతదేశంలో 2005లో సమాచార హక్కు చట్టం ఏర్పడింది.
2015 నవంబర్ లో ప్రారంభించబడిన ఈ దినోత్సవం 2016, సెప్టెంబర్ 28న మొదటిసారిగా నిర్వహించడం జరిగింది. 2002 సెప్టెంబరులో బల్గేరియా రాజధాని సోఫియాలో అంతర్జాతీయ హక్కు దినోత్సవంగా గుర్తింపు పొంది, అంతర్జాతీయ పౌర సమాజ న్యాయవాదులచే 2012లో మొదలయింది.సెప్టెంబర్ 28వ తేదీన అంతర్జాతీయంగా ఈ దినోత్సవాన్ని జరుపుతూ, ప్రభుత్వ ఆశయాన్ని గురించి ప్రచారం చేయడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *