ఇంకా చిక్కని చిరుత

సిరా న్యూస్,రాజమండ్రి;
మూడు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతంలో సంచరిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయంగా మారింది. తూర్పుగోదావరి,కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు. అయితే గురువారం ఆ చిరుత కదలికలు ఉన్న కడియపులంక చెక్కపల్లి వారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లు ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక,పంది పిల్లలను ఉంచారు. గత మూడు రోజుల నుండి ఆ చిరుత ఆహారంగా ఏ జంతువును తిన్న ఆనవాళ్ళు కనబడలేదు. అందువల్ల ఆహారం కోసం ఈ బోనులోకి వచ్చి చిక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ నుండి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది.ఇప్పటికే దివానచెరువు, కడియం ప్రాంతలలో పాతిక రోజులుగా అధికారులు వేసిన ఎత్తుగడలను చిత్తు చేస్తూ తప్పించుకుని తిరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *