సిరా న్యూస్,అన్నమయ్య;
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ములకలచెరువులో ఈ నెల 22న ఆదివారం అర్థ రాత్రి ఏ.సఫియా భేగం ను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన కేసులో మృతురాలి కొడుకు చిన్నరెడ్డి బాషా, కోడలు ఆషియాను గురువారం రాత్రి అరెస్టుచేసినట్లు ములకళచెరువు సీఐ రాజారమేశ్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. మృతురాలు సఫియాబేగం తో ఆమె చిన్నకొడుకు, కోడలు ఆస్తికోసం గొడవపడి మిద్దిపైన నిద్రిస్తున్న సఫియా బేగంను పథకం ప్రకారం కత్తితో గొంతుకోసి దారుణంగా చంపినట్లు విచారణలో తేలిండంతో నిందితులను అరెస్టు చేశామన్నారు.