సిరా న్యూస్,చిత్తూరు;
బైరెడ్డిపల్లి మండలంలోని దేవదొడ్డి వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. శుక్రవారం ఉదయం వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు..చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం లోని బైరెడ్డిపల్లి మండలం, దేవరదొడ్డి గ్రామం వద్ద గురువారం అర్ధ రాత్రి ఎన్ హెచ్ వర్క్ చేస్తున్న బయట రాష్ట్రాలకు చెందిన ఇద్దరిని కొట్టి చంపినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మాట్లాడలేని కారణంగా దొంగలనుకుని చంపారని అనుమానాలు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని పలమనేరు సీఐ పరిశీలించారు.