సిరాన్యూస్, ఆదిలాబాద్
కొండా లక్ష్మణ్ బాపూజీకి కలెక్టర్ రాజర్షి షా నివాళి
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణా ఉద్యమనేత కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణం లోని గాంధీ పార్క్ పక్కన ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జిల్లా పాలనాధికారి రాజర్షి షా పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, బిసి సంక్షేమ శాఖ అధికారి రాజాలింగు , పద్మశాలి సంఘ నాయకులు, తదితరులు ఉన్నారు.