సిరా న్యూస్, సైదాపూర్:
రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం : వెన్నంపల్లి సింగిల్ విండో ఛైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి
రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన లక్ష్యమని వెన్నంపల్లి పాక్స్ ఛైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి అన్నారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో అయన అధ్యక్షతన శుక్రవారం జరిగిన మహాజన సభలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఈఓ మల్లారెడ్డి ఆర్థ వార్షిక నివేదిక బడ్జెట్ ను రైతులకు చదివి వినిపించారు. వెన్నంపల్లి సింగిల్ విండో ఛైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, ఎరువులను విక్రయిస్తూ రైతులకు సహకార సంఘాలు రైతులకు ఎంతగానో అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ఉన్న వెన్నంపల్లి, అరెపల్లి, లస్మన్నపల్లి, సోమారం, ఎక్లాస్ పూర్ మొత్తం ఐదు గ్రామాల రైతులకి గానూ 438 మంది రైతులకి రుణమాఫీ అయిందని, మిగతా 179 మంది రైతులకి రుణమాఫీ కాలేదని తెలిపారు. ఆధార్ అప్డేషన్, కేవైసీ సమస్యల వల్ల మిగతా రైతులకు రుణమాఫీ కాలేదని త్వరలో రుణమాఫీ కాని వారికి రుణమాఫీ అయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వనున్నట్లు వస్తుందని అన్నారు. లస్మన్నపల్లి గ్రామంలో నూతన పాడి సెంటర్ ను ఏర్పాటు చేయాలని, పాడి సెంటర్ కోసం అనువైన స్థలం లేక రైతులు పండించిన వడ్లను సోమారం టు మొలంగూర్ ఎక్స్ రోడ్డు వరకు వడ్లను ఆరబెట్టడం వలన నిత్యం వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని, పాడి సెంటర్ ఏర్పాటు కోసం త్వరలో స్థలాన్ని సేకరించి పనులు ప్రారంభిస్తామని అన్నారు. సహకార సంఘాలలో అప్పులు తీసుకొని సకాలంలో చెల్లించినట్లయితే సంఘ అభివృద్ధికి కృషి చేసిన వాళ్లమవుతమన్నారు. వెన్నంపల్లి సహకార సంఘాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడానికి నూతన భవనాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అతి త్వరలో గోల్డ్ లోన్ సౌకర్యంతో పాటు హై సెక్యూరిటీ లాకర్లను ఏర్పాటు చేపిస్తున్నామని తెలిపారు. గోల్డ్ లోన్ కోసం ఎవరైతే ముందుగా 20వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేస్తారో వారికి 7శాతం ఇంట్రెస్ట్ తో లోన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రజల దూర ప్రయాణాలు లేకుండా వారి సౌకర్యార్థానికి వీలుగా త్వరలో ఏటీఎం సెంటర్ తో పాటు, మీసేవ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హుజురాబాద్ వ్యవసాయ సంఘాల ఆడిటర్ శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్, రాజిరెడ్డి, రాంరెడ్డి, సౌందర్య, సంపత్, కోమల, తిరుపతి, మోహన్ రావు, అబ్బయ్య, రాజేశ్వర్ రెడ్డి, కనకయ్య, సంఘ సిబ్బంది సీఈఓ మల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి, సంపత్, రాజు, సుశీల, మహేందర్ రెడ్డి, మహేష్, అనిల్ రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.