భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడి మతోన్మాదాన్ని తరిమికొడదాం

-డివైఎఫ్ఐ
 సిరా న్యూస్,దేవనకొండ;
భగత్ సింగ్117వ జయంతి కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ మండల కార్యదర్శి కే. శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. డివైఎఫ్ఐ మండల సహాయ కార్యదర్శి చిన్న వీరేంద్ర నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి డివైఎఫ్ఐ మండల కార్యదర్శి కే.శ్రీనివాసులు నాగరాజు మాట్లాడుతూ 1907 సెప్టెంబర్ 28వ తేదీ లాయల్పూర్ జిల్లా బంగా గ్రామంలో జన్మించిన భగత్ సింగ్ లాల లజపతిరాయి మహాత్మా గాంధీ పిలుపులను అందుకొని భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు తెలిపారు. ఏడు సంవత్సరాల వయసులో గద్దర్ వీరుడైన కత్తర్ సింగ్ ని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేస్తే వాళ్ల చిన్నమ్మకు ధైర్యం చెప్పాడని తెలిపారు. తమ పెరట్లో తుపాకులు నార్తే అవి పెరిగి భారీగా తుపాకులు కాస్తాయి వాటి ద్వారా బ్రిటీష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టొచ్చు కదా అని తన తండ్రికి తెలిపిన వ్యక్తి అని అన్నారు. లాలజపతిరాయ్ పై బ్రిటిష్ ప్రభుత్వం కాల్పులు జరిపితే ప్రతి చర్యగా సాండర్స్ అనే పోలీసును కాల్చి చంపారని ఆ తర్వాత భగత్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక విప్లవ పోరాటాలను గ్రంథాలను అధ్యయనం చేసి టెర్రరిజం నుండి మార్క్సిజం వైపుకు, ఆస్తికము నుండి నాస్తికం వైపుకు మారారని తెలిపారు. భగత్ సింగ్ నౌజవాన్ భారత్ సభ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికం ఆర్మీ అసోసియన్ పేరుతో ఆనాటి విద్యార్థును యువకులను స్వతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేశారని తెలిపారు. స్వతంత్ర పోరాటానికి తూట్లు పొడిసే విధంగా లాలాలజపతిరాయ్ ఇందు మహాసభకు వెళ్లడంతో మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ తో పనిచేయడం వల్ల తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి భగత్సింగ్ అని తెలిపారు. నాన్న క్షమాభిక్ష కోరమంటే సున్నితంగా తిరస్కరించి తండ్రిగా జన్మ ఇవ్వడం వరకే నీ హక్కు ఎలా బ్రతకాలి ఎలా చనిపోవాలని నా ఇష్టమని తెలిపిన వ్యక్తి భగత్ సింగ్ అని తెలిపారు. నేడు భగత్ సింగ్ కోరుకున్న సమ సమాజం కాకుండా మతోన్మాద రాజ్యం రావడం ఇలాంటి తరుణంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో మతోన్మాదం తెచ్చరిల్లి మూఢత్వం పెరిగిపోయి రెండు సంవత్సరాల విద్యార్థిని ఉపాధ్యాయులే నరబలి ఇవ్వడం సమాజానికి సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలిపారు. ఈ తరుణంలో యువకులు విద్యార్థులు శాస్త్రీయ విద్యా విధానం కోసం, శాస్త్రీయబద్ధంగా బ్రతకడం కోసం మతఉన్మాదానికి, మూఢత్వానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే భగత్ సింగ్ కి నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు నాని, వీరప్ప,చిన్న, రంగస్వామి, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *