సిరాన్యూస్, ఓదెల
రైతులందరికీ రుణమాఫీ చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
* అడిషనల్ కలెక్టర్‌కి వినతి పత్రం అందజేత
రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈ శ్వర్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని పెద్దపల్లి జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని కోరుతూ పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్బంగా మాజీ మంత్రి కొప్పుల ఈ శ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో నేడు ఎన్నికల సహాయంతో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ రుణమాఫీ చేస్తామని అందరికీ మాట ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమం లో పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోర్ కంటి చందర్, మంథిని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఓదెల మాజీ జెడ్పిటిసి గంట రాములు, బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష, జడ్పిటిసిలు , ఎంపీటీసీ లు బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు తదితరాలు పాల్గొన్నారు.