సిరా న్యూస్, సైదాపూర్:
వెన్నంపల్లి హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు
సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామ హైస్కూల్లో మంగళవారం ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా విద్యార్థులు కోలాటాలతో, ఆటపాటలతో అత్యంత ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు నృత్యం చేస్తూ సందడి చేశారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల ప్రత్యేక పండగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో హైస్కూల్ టు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.