సిరా న్యూస్,రంగారెడ్డి;
సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధి కోదండరాం నగర్ లో నిన్న రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. కోదండరాం నగర్ లో నివాసం ఉంటున్న కుటుంబం వి.వెంకటేశ్వర ప్రసాద్, భార్య లత , ముగ్గురు కుమారులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం లోని ఐదుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నంకు ఒడిగట్టారని సమాచారం. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుటుంబం మొత్తాన్ని వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని సరూర్ నగర్ పోలీసులు విచారణ చేస్తున్నారు