Mandagada School: మండగడ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు

సిరా న్యూస్, జైన‌థ్‌
మండగడ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల మండగడలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామస్తులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈసంద‌ర్బంగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు, కళాశాలలోని విద్యార్థినులు, అధ్యాపకులు బతుకమ్మ పాటలతో నృత్యాలు చేశారు.అనంత‌రం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రమణి మాట్లాడుతూ దసరా సెలవులు ముగింపు సందర్భంగా ముందస్తుగా బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.రంగురంగుల పూలను శిఖరంగా పేర్చి ఉపాధ్యా యులు, గ్రామస్తులు విద్యార్థులంతా కలిసి ఆనందంగా చేసుకునే పండుగే బతుకమ్మ, పువ్వుల పండుగగా పిలిచే ఈ ఉత్సవం సాంస్కృతిక, సంప్రదాయ,సామాజిక, అనుబంధాల సమాహారం అని అన్నారు. మండగడ గ్రామంలో పూసిన పూలన్నింటినీ సేకరించి, ఇంద్రధనుస్సుల్లా పేర్చడం బతుకమ్మ వేడుకలో ప్రధానమని అన్నారు. బంతి,చామంతి, గునుగు,గుమ్మడి, తంగేడు,గడ్డి పూలు తదితర పూలతో ముందస్తు సంబరాలు చేసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విట్టల్ , అర్చన ,సునంద , అస్మా , గ్రామ యువతులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *