శ్రీ సువర్ణ రజిత కవచాలంకారము దేవిగా మావుళ్ళమ్మ అమ్మవారు
సిరా న్యూస్,భీమవరం;
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పుకోరిన కోర్కెలు తీర్చే తల్లి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీ సువర్ణ రజిత కవచాలంకారము దేవిగా మావుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునండి భక్తులు భవానీలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దేవస్థానంఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి తెల్లవారుజామునండి ప్రత్యేక అభిషేకాలు లక్ష కుంకుమార్చన చండీ హోమం వంటి కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకుడు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఈవో సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్,ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహించారు..