సిరా న్యూస్;హైదరాబాద్
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం నాడు బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. అయనకు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని పూజలలో అయన పాల్గొన్నారు. అమ్మవారు తొలిరోజు బాలాత్రిపురసుందరిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.