సిరా న్యూస్,హైదరాబాద్;
మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యాలతో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకున్నది. మంత్రి ఆమె వ్యాఖ్యలని వెనుకకు తీసుకున్నారు. ఈ అంశం ఇక్కడితో ముగింపు పలకండని టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ కోరారు. ఇరు వైపులా మహిళలు ఉన్నారు..కావునా ఈ విషయం ను ఇంతటి తో వదలండి. మహిళ ల మనోభావాలను కించపరచాలని ఆమె ఉద్దేశ్యం కాదు. కొండా సురేఖ ట్వీట్ లో వారు హిరోయిన్ గా ఎదిగిన తీరు కేవలం అభిమానం మాత్రమే కాదు నాకు ఆదర్శం కూడా..అని ట్వీట్ చేశారు . ఒక సోదరుడు సోదరికి నూలు దండ వేస్తే ఆమె పై సోషల్ మీడియా లో చేసిన ట్రోల్ చూసాము. సమాజం లో ఒకరి గురించి ఒకరు చెడు గా మాట్లాడకండి. మా కాంగ్రెస్ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండని అయన సూచించారు.