సిరా న్యూస్,విజయవాడ;
దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా కాలినడకన వెళ్లారు. వన్ టౌన్ వినాయకుడి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సాధారణ క్యూ లైన్ లో భక్తులతో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అమ్మవారిని కాలినడకన వెళ్లి దర్శించుకుంటున్నారు. గురువారం బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో కనకదుర్గమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.