సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో దేవి శరన్ నవరాత్రి ఉత్సవాలలో శుక్రవారం నాడు అమ్మవారు “బ్రహ్మచారిణీ” అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఆలయ వైదిక బృందం విశేష కుంకుమ పూజ లను నిర్వహించి పులిహోర నైవేద్యం గా నివేదించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
బ్రహ్మచర్య ఆశ్రమంలో గురువు వద్ద తోటి విద్యార్థినులతో ఉండే బ్రహ్మచారిణీ నవ దుర్గల్లో రెండో అవతారం గా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. తెల్లని చీర ధరించి కుడి చేతిలో జప మాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి బ్రహ్మచారిణీ దేవి గా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తుంది..